ముగిసిన క్రీడా సంబరాలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన క్రీడా సంబరాలు

Jan 31 2026 10:29 AM | Updated on Jan 31 2026 10:29 AM

ముగిసిన క్రీడా సంబరాలు

ముగిసిన క్రీడా సంబరాలు

● మూడు రోజుల పాటు జిల్లాస్థాయి బాలికల క్రీడా పోటీలు ● విజేతలకు బహుమతుల ప్రదానం

బోథ్‌: బోథ్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల క్రీడా ప్రాంగణంలో మూడు రోజుల పాటు అత్యంత ఉత్సాహంగా సాగిన శ్రీజిల్లాస్థాయి బాలికల స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ మీట్‌–2026 (ప్రేరణ)శ్రీ క్రీడాపోటీలు శుక్రవారం ముగిశాయి. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేష్‌ మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణను పెంపొందించడమే కాకుండా మానసిక, శారీరక ధృఢత్వానికి తోడ్పడతాయన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి వేదికలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ మాట్లాడుతూ తమ ప్రాంత విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ప్రతిభ కనబరుస్తుండటం గర్వకారణమన్నారు. కలెక్టర్‌ రాజార్షి షా మాట్లాడుతూ లక్ష్య సాధనలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి క్రీడల ద్వారా లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. అనంతరం వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, క్యారమ్స్‌, చెస్‌, టెన్నికాయిట్‌ అండర్‌–14, అండర్‌–17 విభాగాల్లో జరిగిన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అథ్లెటిక్స్‌ అండర్‌–14, అండర్‌–17 విభాగాల్లో, ఓవరాల్‌ గేమ్స్‌ చాంపియన్‌షిప్‌గా ఆశ్రమ పాఠశాల విజేతగా నిలిచింది. ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ ద్వితీయ స్థానాన్ని ట్రైబల్‌ వెల్ఫేర్‌ గురుకులం గెలుచుకుంది. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో యువరాజ్‌ మర్మాట్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లెపూల నర్సయ్య, అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్‌, సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల ప్రిన్సిపాల్‌ సంగీత, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement