సల్లంగచూడు మైసమ్మా..
ఖిల్లాపైకి వస్తున్న భక్తులు
అమ్మవారికి మొక్కులు చెల్లిస్తున్న భక్తులు
నృత్యాలు చేస్తున్న ఆదివాసీలు
సెల్ఫీ తీసుకుంటున్న యువతులు
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట శివారులోని గాంధారిఖిల్లా వద్ద మైసమ్మ తల్లి జాతర ఆదివారం ముగిసింది. మూడు రోజులు కనుల పండువగా సాగిన ఈ ఉత్సవంలో చివరి ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. తెల్లవారుజామున జీడీకోట నుంచి ఆదివాసీలు సంప్రదాయ తప్పెటగూళ్లు, డప్పుచప్పుళ్లతో ఖిల్లాపైకి చేరుకున్నారు. గంగాజలంతో దేవతా మూర్తులను శుద్ధిచేసి పట్నాలు వేశారు. ప్రత్యేక పూజలు చేశారు. నైవేద్యం సమర్పించి కిందకు వెళ్లారు. గిరిజన సంస్కృతి నృత్యాలతో ఉత్సవాలు జరిపారు. పెద్ద సంఖ్యలో ఆదివాసీ నాయక్‌పోడ్‌లు, భక్తులు తరలి రావడంతో గాంధారీఖిల్లా ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం కనిపించింది. చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, నాయక్‌పోడ్ సంఘం నాయకులు, ఆయా రాజకీయ పార్టీల నాయకులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. – రామకృష్ణాపూర్
సల్లంగచూడు మైసమ్మా..
సల్లంగచూడు మైసమ్మా..
సల్లంగచూడు మైసమ్మా..


