జంపన్నవాగులో భీమారం వాసి మృతి
భీమారం: మేడారం సమ్మక్క జాతరకు వెళ్లిన భీ మారం మండల కేంద్రానికి చెందిన కొమ్ము శ్రీ ని వాస్(54) బుధవారం జంపన్నవాగులో మునిగి మృతిచెందాడు. దీంతో భీమారంలో విషాదం నెలకొంది. మంగళవారం రాత్రి శ్రీనివాస్‌తోపాటు అత ని సోదరుని కుటుంబాలు కలిసి ఆటోరిక్షాలో మంచిర్యాల వరకు వెళ్లి అక్కడ నుంచి మేడారం వెళ్లారు. సమ్మక్క దర్శనానికి ముందు జంపన్న వాగులో పు ణ్య స్నానానికి వెళ్లిన శ్రీనివాస్ అందులోనే మునిగి చనిపోయాడు. నాలుగు రోజు ల క్రితమే మేడారం వెళ్లి దర్శనం చేసుకుని వచ్చాడని అతడి స్నే హితులు తెలిపారు. మరోసారి కుటుంబంతో వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. శ్రీనివాస్ మండల కాంగ్రెస్ నాయకుడిగా చురుగ్గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య లక్ష్మి, కుమారులు వినయ్, హరీష్ ఉన్నారు.


