ఇంటి స్థలం విషయంలో దాడి
లక్ష్మణచాంద: ఇంటి స్థలం విషయంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవలో ఒకరు గాయపడ్డారు. ఎస్సై శ్రావణి తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన సల్కం పోశెట్టి పదేళ్ల కిందట ఇదే గ్రామానికి చెందిన దుర్గన్నకు ఇంటి స్థలం విక్రయించాడు. మంగళవారం తాను కొనుగోలు చేసిన స్థలాన్ని దుర్గన్న చదును చేస్తున్నాడు. కాగా, తాను అమ్మిన స్థలానికంటే ఎక్కువ విస్తీర్ణంలో చదును చేస్తున్నావని పోశెట్టి గొడవకు దిగాడు. ఈక్రమంలో పోశెట్టిపై దుర్గన్నతోపాటు అజయ్ దాడి చేశారు. దీంతో పోశెట్టికి తీవ్ర గాయాలు కాగా, చికిత్స కోసం అతడిని 108లో నిర్మల్ ఏరియాస్పత్రికి తరలించారు. పోశెట్టి కుమార్తె కావ్య ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


