మద్యం మత్తులో పురుగుల మందు తాగి..
వాంకిడి: మద్యం తాగడం మానేయాలని మందలించినందుకు మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడి మండలంలోని ధాబా గ్రామానికి చెందిన కు డ్మెత రాంశావు(56) కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 26న సాయంత్రం మద్యం మత్తులో ఇంటికి వచ్చి అతడిని భార్య సురేఖ బాయి మందలించింది. అనంతరం రాంశావు కంది చేనుకు వెళ్లొస్తానని ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయాడు. తిరిగి ఇంటికి వచ్చాక వాంతులు చేసుకోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు వాంకిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథ మ చికిత్స అనంతరం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లినా ఆరోగ్యం కుదుటపడలేదు. మళ్లీ మంగళవారం మహారాష్ట్రలోని చంద్రాపూర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో రాత్రి 9 గంటలకు మృతి చెందాడు. మృతుడి భార్య సురేఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


