కడుపు నొప్పి భరించలేక ఒకరు ఆత్మహత్య
వాంకిడి: కడుపు నొప్పి భరించలేక ఒకరు పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడి మండలం లెండిగూడ గ్రామానికి చెందిన వడై నివృత్తి(28) గత కొంత కాలంగా విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం హైదరాబాద్, చంద్రపూర్ ఆస్పత్రుల్లో రూ.10 లక్షల వరకు ఖర్చు చేసినా నయం కాలేదు. మూడు రోజులుగా నొప్పి పెరగడంతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో బైక్‌పై చేనుకు వెళ్లి పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని బంధువులకు సమాచారం అందించాడు. వారు చేనుకు వెళ్లి అతడిని ఇంటికి తీసుకువస్తుండగా మృతి చెందాడు. మృతుడి భార్య పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


