రిమ్స్‌లో క్రిటికల్ కేర్ సేవలు ప్రారంభం
ఆదిలాబాద్‌టౌన్: రిమ్స్‌లో క్రిటికిల్ కేర్ సేవలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. శ్రీసాక్షిశ్రీలో ఇటీవల ప్రచురితమైన కథనానికి డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ స్పందించారు. శ్రీఒక్క రోజు ఆర్బాటంశ్రీ శీర్షికన గత శనివారం కథనం ప్రచురితమైంది. రూ.23.75 కోట్ల వ్యయంతో నిర్మించిన క్రిటికల్ కేర్ విభాగాన్ని ఆర్భాటంగా ప్రారంభించినా సేవలు మాత్రం ప్రారంభం కాలేదని అందులో ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం క్రిటికల్ కేర్‌లో ఆర్థోపెడిక్ ఓపీ సేవలను ప్రారంభించారు. దశలవారీగా మిగతా విభాగాల సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన వివరించారు.
రిమ్స్‌లో క్రిటికల్ కేర్ సేవలు ప్రారంభం


