వనంవీడి జనంలోకి..
ఆసిఫాబాద్‌అర్బన్: రెండేళ్లకోసారి జరిగే వనదేవతల జాతర జిల్లా కేంద్రంలోని పెద్దవాగు తీరాన, కేస్లాపూర్ హనుమాన్ ఆలయం ఎదురుగా నేడు ప్రారంభం కానుంది. సుమారు 30 వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునే అవకాశం ఉందని ఆలయ పూజారి రమేశ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కోవ లక్ష్మి నివాసం నుంచి నేడు ఉదయం 10 గంటలకు కుంకుమ భరిణి, పసుపు, కంకవనం, తదితర పూజా సామగ్రితో గద్దెల వరకు భాజా భజంత్రీలతో వచ్చి ప్రత్యేక పూజలు చేసి జాతర ప్రారంభిస్తారు.
గద్దెల చరిత్ర..
బూరుగుడాకు చెందిన ముదురుకోల రమేశ్‌కు 1985లో వివాహమైంది. 20 ఏళ్లయినా సంతాన ం కాకపోవడంతో మేడారం వెళ్లి సమ్మక్క, సారలమ్మను దర్శించున్నాడు. ఇద్దరు కూతుర్లు, కుమారుడు జన్మించడంతో వారికి సమ్మక్క, సారలక్క, జంపన్న అని నామకరణం చేశాడు. 2016లో పెద్దవాగు తీరాన సొంత ఖర్చులతో గద్దెలను నిర్మించాడు. భక్తులు, ప్రముఖుల సహకారంతో నీరు, విద్యుత్, రహదారి సౌకర్యం కల్పించాడు.


