108 అంబులెన్స్‌లో ప్రసవం
నెన్నెల: కన్నెపల్లి మండలంలోని నాయకునిపేటకు చెందిన నిండు గర్భిణి కవితకు ఆదివారం పురుటినొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబీ కులు 108కు సమాచారం ఇచ్చారు. నెన్నెల 108 సిబ్బంది ఈఎంటీ రాజేశ్వరి, పైలట్ రాజే శం వెంటనే అంబులెన్స్ నాయకునిపేటకు చే రుకుని కవితను బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా పురుటినొప్పులు తీవ్రమయ్యా యి. ఉన్నతాధికారుల సూచన మేరకు 108 సి బ్బంది ప్రసవం చేయగా కవిత ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డా క్షేమంగా ఉండగా బెల్లంపల్లి సీహెచ్‌సీకి తరలించారు. అత్యవసర సమయంలో కవితకు పురుడు పోసిన 108 సి బ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.


