కాంగ్రెస్ గూటికి చెన్నూర్ తాజా మాజీ చైర్‌పర్సన్
చెన్నూర్: చెన్నూర్ మున్సిపాల్టీలో బీఆర్‌ఎస్ కు షాక్ తగిలింది. మున్సిపల్ తాజా మాజీ చైర్‌పర్సన్ అర్చన, రాంలాల్‌గిల్డా దంపతులు హైదరాబాద్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి వివేక్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్య వహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పా ర్టీ సీనియర్ నాయకులు గొడిసెల బాపురెడ్డి, పెద్దింటి శ్రీనివాస్ పాల్గొన్నారు. కాగా, చె న్నూర్‌కు చెందిన మైనార్టీ నాయకుడు షఫీ యొద్దీన్ అనుచరులతో బీజేపీలో చేరారు.


