ఎన్నికల ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలి

Feb 4 2026 7:31 AM | Updated on Feb 4 2026 7:31 AM

ఎన్నికల ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలి

ఎన్నికల ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలి

● కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ● ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిశీలన ● కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష

బెల్లంపల్లి: మున్సిపల్‌ ఎన్నికల ఏర్పాట్లను సక్రమంగా చేపట్టాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సూచించారు. మంగళవారం బెల్లంపల్లి మున్సిపాలిటీలోని బజా రు ఏరియా జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏ ర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రం, మున్సిపల్‌ కా ర్యాలయాన్ని సందర్శించారు. కౌంటింగ్‌ కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎ క్కడైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌కు 08736–250501 నంబర్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ వీడియోగ్రఫీ చేయనున్నట్లు తెలిపారు. 11న పోలింగ్‌, అవసరమైన చోట్ల 12న రీపోలింగ్‌, 13న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం రామ్‌నగర్‌ బస్తీలో కొనసాగుతున్న మండల పరిషత్‌ ప్రాథమి కోన్నత పాఠశాల భవన నిర్మాణ పనులను పరిశీ లించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని అధికా రులను ఆదేశించారు. కేజీబీవీ భవన నిర్మాణ పనులను పర్యవేక్షించి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సూచించారు. కలెక్టర్‌ వెంట మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్‌, పలువురు అధికారులున్నారు.

కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి

నస్పూర్‌: వరి ధాన్యం, పత్తి పంటల కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సూచించారు. కలెక్టరేట్‌ సమవేశ మందిరంలో అదనపు కలెక్టర్‌తో కలిసి వ్యవసాయ, సహకారశాఖల అధికారులు, మార్కెట్‌ కమిటీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 2లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధా న్యం దిగుబడి వచ్చే అవకాశముందని తెలిపారు. రైస్‌ మిల్లులకు ఒక మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని సూచించారు. జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్‌ శ్రీకళ, జిల్లా సహాయ అధికారులు, మార్కెటింగ్‌ అధికారి షాహబుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement