‘పది’ విద్యార్థులకు ప్రేరణ
మంచిర్యాలఅర్బన్: పదో తరగతి విద్యార్థుల ను పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక ప్రే రణ తరగతులు నిర్వహిస్తున్నామని అదనపు కలెక్టర్ చంద్రయ్య తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలో బీసీ సమీకృత వసతిగృహంలో అవగాహన తరగతులు నిర్వహించారు. పరీక్షలంటే భయాందోళన, ఒత్తిడి కి గురికా వొద్దని, ప్రణాళికతో చదివి మంచి మార్చులు సాధించాలని సూచించారు. జిల్లా వెనుకబడి న తరగతుల అభివృద్ధిశాఖ అధికారి భాగ్యవ తి, షెడ్యూల్ కులాల అభివృద్ధిశాఖ ఉపసంచాలకుడు దుర్గాప్రసాద్, డీఈవో యాదయ్య, మైనార్టీ సంక్షేమాధికారి రాజేశ్వరి, ఏటీడీవో సురేశ్, మానసిక వైద్యనిపుణుడు సునీల్, టీ ఎన్‌జీవో ప్రతినిధి శ్రీహరి తదితరులున్నారు.


