ఒక్కోచోట నలుగురిపైనే..
సాక్షి, ప్రతినిధి, మంచిర్యాల: మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కో డివిజన్/వార్డు స్థానం నుంచి సగటు న నలుగురిపైనే అభ్యర్థులు బరిలో ఉన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతనపల్లి, లక్సెట్టిపేట మున్సి పాలిటీల పరిధిలో మొత్తం 149వార్డులు/డివిజన్లుండగా 693మంది బరిలో నిలిచారు. మంచిర్యాల కార్పొరేషన్‌లో రెండు ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్, బీజేపీ ‘బీ ఫాం’లకు పోటీ లేకుండా పోయింది. పదో డివిజన్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి ‘బీ ఫాం’ అందుకున్నాక విత్‌డ్రా చేసుకున్నారు. ఇక మూడో వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా బడికె లక్ష్మి నామినేషన్ వేశారు. నామినేషన్ ఫాంలో పార్టీ పేరు నమోదు చేయకపోవడంతో ఆమెకు బీఆర్‌ఎస్ మద్దతు తెలిపినా కారు గుర్తు దక్కలేదు. కాంగ్రెస్ 59 స్థానాల్లో అభ్యర్థులను దింపి ఒక స్థానాన్ని సీపీఐకి కేటాయించింది.
ఒక్కోచోట నలుగురిపైనే..
ఒక్కోచోట నలుగురిపైనే..


