కజ్జర్లలో రూ.10 కోట్లతో గోదాం నిర్మాణం
తలమడుగు: మండలంలోని కజ్జర్ల శివారులో ఐదెకరాల స్థలంలో రూ.10 కోట్ల వ్యయంతో రై తులకు ఉపయోగపడేలా గోదాం నిర్మాణం చే పట్టనున్నట్లు తెలంగాణ రాష్ట్ర వేర్ హౌసింగ్ కా ర్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ తెలి పారు. సోమవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూ పల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు తహసీల్దార్ రాజమోహన్‌తో కలిసి స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నారాయణరెడ్డి, ఆర్‌ఐ రోహిదాస్, గ్రామస్తులు శ్రీనివాస్, పోశెట్టి, పూర్ణచందర్, తిరుపతి పాల్గొన్నారు.
ఆటో డ్రైవర్‌పై కత్తులతో దాడి
బోథ్: మండల కేంద్రంలో సోమవారం రాత్రి ఆటో డ్రైవర్ షేక్ అజీమ్‌పై ఆరుగురు వ్యక్తులు కత్తులతో దాడికి పా ల్పడ్డారు. బాధిత కు టుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉన్న అజీమ్‌ను ఒక్కసారిగా చుట్టుముట్టిన దుండగులు తమ వెంట తెచ్చుకున్న కత్తులతో దాడి చేశారు. గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే బోథ్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం వైద్యులు ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. కాగా ఈ దాడికి పాల్పడింది బాధితుడికి అత్యంత సన్నిహితులైన బంధువులేనని కు టుంబ సభ్యులు పేర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై పురుషోత్తం ఆస్పత్రిని సందర్శించి వివరాలు సేకరించారు. కాగా సంఘటనపై ఇంకా ఫిర్యాదు అందలేదన్నారు.
అప్పగించిన పశువులు ఏమవుతున్నాయ్?
దండేపల్లి: జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట మండలాల్లో అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న ఆవులు, ఎడ్లు, కోడెలను సంరక్షణ ని మిత్తం పలు సందర్భాల్లో దండేపల్లి మండలంలోని మాదాపూర్ గోశాలకు అప్పగిస్తున్నారు. కానీ వీటిని కొందరు ఎలాంటి నిబంధనలు పాటించకుండా తీసుకెళ్తున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం ఓ బొలెరో వాహనంలో తరలిస్తున్న 2 ఎడ్లు, 7 కోడెలను జన్నారం సమీపంలో గోరక్షక కార్యకర్తలు పట్టుకుని పో లీసులకు అప్పగించారు. వాటిని మాదాపూర్ గోశాలకు అప్పగించగా అందులోంచి రెండు ఎడ్లను దండేపల్లి పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే ఓ కానిస్టేబుల్ ఆదివారం తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇవే కాకుండా గతంలోను పోలీసులు పట్టుకుని అప్పగించిన పశువులను గోశాల నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా ఇతరులకు ఇచ్చారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈవిషయమై గోశాల సేవకుడు వెంకటేష్‌ను ఫోన్‌లో సంప్రదించగా వివరాలు తర్వాత ఇస్తానని చెప్పి కానిస్టేబుల్ జన్నారం నుంచి వచ్చిన రెండు ఎడ్లను తీసుకెళ్లినట్లు తెలిపాడు.
బీఫాం కోసం పడిగాపులు
బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బీ ఫామ్ కోసం గంటల తరబడి పడిగాపులు కాశారు. బీ ఫామ్ అందజేయడానికి మంగళవారం తుది గడువు కావడంతో ఎమ్మెల్యేను కలవడానికి అభ్యర్థులు తరలివచ్చారు. మున్సిపాలిటీలోని 34 వార్డుల నుంచి నామినేషన్ వేసిన కాంగ్రెస్ ఆశావహులు 180 మందికి పైగా రావడంతో ఒక్కసారిగా సందడిగా మారింది. ఈ మేరకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని, ఆ ప్రక్రియ పూర్తికాగానే బీఫామ్ అందజేస్తామని తెలిపి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కజ్జర్లలో రూ.10 కోట్లతో గోదాం నిర్మాణం


