సమ్మె నోటీస్ అందజేత
పాతమంచిర్యాల: కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ నెల 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేపడుతున్నట్లు అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబందం) జిల్లా గౌరవ అధ్యక్షుడు ఖలీందర్ అలీఖాన్ తెలిపారు. సోమవారం అంగన్‌వాడీ ఉద్యోగులతో కలిసి జిల్లా సంక్షేమాధికారి రవూఫ్‌ఖాన్‌కు సమ్మె నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను కోడ్‌లుగా విభజించి కార్మికుల హక్కులను హరించే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షురాలు సురేఖ, ఉపాధ్యక్షురాలు అపర్ణ, నాయకులు కవిత, నాగమణి, పద్మావతి, కృపా, రాజవ్వ, సూరజ, అరుణ, రాజమణి, తదితరులు పాల్గొన్నారు.


