పోరాటాల పొద్దుపొడుపు ‘బెల్లంపల్లి’
బెల్లంపల్లి: మున్సిపాలిటీగా అవతరించక ముందు బెల్లంపల్లి చంద్రవెళ్లి గ్రామ పంచాయతీలో అ నుబంధ గ్రామంగా కొనసాగింది. కార్మికులు, కార్మికేతర బస్తీలతో ఏర్పడి లక్షకు పైగా జనాభా కలి గిన బెల్లంపల్లి అనివార్యంగా గ్రా మ పంచాయతీ పాలనలో కొనసాగాల్సి వచ్చింది. శాంతిఖని, 44 డీప్, 68 డీప్, 65 డీప్, 24 డీప్, 2 ఇంక్‌లైన్, మార్గన్స్‌ఫిట్, సౌత్ క్రాస్‌కట్ భూగర్భ గనులు, 8 మెగావాట్స్ సామర్థ్యం కలిగిన పవర్ హౌజ్, వర్క్‌షాప్, ఆటో గ్యారేజ్ , స్టోర్, సింగరేణి ఎక్స్‌ప్లోరేషన్ పదికి పైగా విభాగాలతో 1980 వరకు కళకళలాడింది. సమస్యలపై నిత్యం కార్మికోద్యమాలు జరి గాయి. బాయి దొరల దాష్టీకాలు, గూండాలు, రౌడీలకు వ్యతిరేకంగా రాడికల్ విద్యార్థి, యువజనులు, సీపీఐ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, ఇతర పార్టీలు, సంఘాలు చైతన్యవంతమైన పోరాటాలు నిర్వహించారు. ఓ బాయి దొర కొడుకు రాజేశ్వరి అనే మహిళపై లైంగికదాడికి పా
ల్పడి హత్యచేసిన ఘటనకు నిరసనగా యువజనులు, విద్యార్థులు, బస్తీవాసులు, రాజకీయ పక్షాలు నిర్వహించిన ర్యాలీ పోలీసు కాల్పులకు దారి తీసింది. ఆ కాల్పుల్లో ముగ్గురు మృత్యువాత పడగా పలువురు గాయపడ్డారు. ఆ తీరుగా బెల్లంపల్లి పోరాటాలకు నెలవుగా మారింది. అప్పటి స్ఫూర్తిదాయకమైన సమరశీల పోరాటాలు బెల్లంపల్లి చరిత్రకు తలమానికంగా నిలుస్తున్నాయి.
సర్పంచ్ ఎన్నిక చరిత్రాత్మకం
చంద్రవెళ్లి గ్రామపంచాయతీ ఏలుబడిలో ఉన్న బెల్లంపల్లి నుంచి సర్పంచ్ పదవికి కాకలు తీరిన యోధులు పోటీ చేశారు. అప్పట్లో కాంగ్రెస్, సీపీఐ తప్ప ఇతర ప్రధాన రాజకీయ పార్టీల ప్రభావం అంతగా ఉండేది కాదు. కాంగ్రెస్ మద్దతు దారుడిగా ప్రముఖ వ్యాపార వేత్త సోమశేఖరరావు, సీపీఐ బలపర్చిన కార్మిక నాయకుడు చిప్ప నర్సయ్య పోటీ పడ్డారు. అర్థబలం, అంగబలం కలిగిన సోమశేఖరరావుతో సింగరేణిలో మైనింగ్ సర్దార్‌గా పని చేస్తున్న నర్సయ్య పోటీకి దిగడం ఆరోజుల్లో పెను సంచలనమైంది. హోరాహోరీగా ఎన్నికల్లో పోటీ పడ్డారు. 1981 మే 30న జరిగిన ఎన్నికల్లో చంద్రవెళ్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా చిప్ప నర్సయ్య గెలుపొంది రికార్డు సృష్టించారు. కమ్యూనిస్టు పార్టీకి కంచుకోటగా ఉన్న బెల్లంపల్లి అప్పట్లో ఆసిఫాబాద్ అసెంబ్లీ, సమితి ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించి ఎర్రజెండాకు ఎదురు లేదని నిరూపించింది. 1987లో బెల్లంపల్లి ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీగా ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కమ్యూనిస్టులు మున్సిపాలిటీపై ఎర్రజెండా ఎగుర వేయలేక పోయారు. టీడీపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు వరుసగా తలో మూడుసార్లు మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు.
బెల్లంపల్లి పట్టణం వ్యూ
పోరాటాల పొద్దుపొడుపు ‘బెల్లంపల్లి’


