మైసమ్మ తల్లికి పూజలు
తరలివస్తున్న ఆదివాసీలు
బోనాలతో వెళ్తున్న మహిళలు
రామకృష్ణాపూర్: మందమర్రి మండలం బొక్కలగుట్ట శివారులోని గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరలో రెండోరోజైన శనివారం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. సాయంత్రం సదర్ భీమన్న వద్ద దేవతామూర్తులకు ఆదివాసీల సంప్రదాయ ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడి నుంచి దేవతామూర్తులను గాంధారి ఖిల్లా దిగువ భాగంలోని జీడికోటకు పిల్లనగ్రోవి వాయిద్యాలు, తప్పెటగూళ్ల ఆటలతో ఊరేగింపుగా తీసుకువచ్చారు. అక్కడ వాటిని ఉంచి రాత్రి లక్ష్మిదేవర, తప్పెటగూళ్ల నృత్యాలు చేశారు. అనంతరం మహిళలు ఖిల్లాపై భాగంలో కొలువుదీరిన అమ్మవారిని నదీజలాలతో శుద్ధిచేసి మైసమ్మ తల్లికి పట్నాలు వేశారు. అర్ధరాత్రి సమయంలో పెద్దపూజ నిర్వహించారు.
మైసమ్మ తల్లికి పూజలు


