నామినేషన్ల స్వీకరణలో అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

నామినేషన్ల స్వీకరణలో అప్రమత్తంగా ఉండాలి

Jan 29 2026 6:39 AM | Updated on Jan 29 2026 6:39 AM

నామినేషన్ల స్వీకరణలో అప్రమత్తంగా ఉండాలి

నామినేషన్ల స్వీకరణలో అప్రమత్తంగా ఉండాలి

నస్పూర్‌/బెల్లంపల్లి/చెన్నూర్‌: మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌, బెల్లంపల్లి, చెన్నూర్‌లోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించారు. బెల్లంపల్లిలో నామినేషన్‌ పత్రాలు తీసుకెళ్లడానికి వచ్చిన అభ్యర్థులతో మాట్లాడి ఎన్నికల నియమావళిపై వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూం నంబరు 08736–250501లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. 31న నామినేషన్లు పరిశీలించి అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని, ఫిబ్రవరి 1న నామినేషన్లపై అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ, 2న పరిష్కారం, 3న నామినేషన్ల ఉపసంహరణ, బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటన ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమాల్లో మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ అన్వేష్‌, డీఆర్‌డీఏ కిషన్‌, మున్సిపల్‌ కమిషనర్లు జే.సంపత్‌, మురళికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement