బరిలో భార్యాభర్తలు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరిలో ఒకే పార్టీ నుంచి భార్యభర్తలు పోటీ చేస్తున్నారు. 43వ డివిజన్‌కు చెందిన గాదె సత్యం, గాదె రమాదేవి గతంలో ఒక్కోసారి కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. 2014లో రమాదేవి అప్పటి 23వ కౌన్సిలర్‌గా గెలుపొందగా, వార్డుల సంఖ్య పెంపుతో వార్డు 32గా మారగా 2020లో భర్త కౌన్సిలర్‌గా గెలుపొందారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ తరపున 43వ డివిజన్ నుంచి భార్య, 20వ డివిజన్ నుంచి భర్త అదే పార్టీ నుంచి బరిలో నిలిచారు. రెండు డివిజన్లలో భార్యభర్తలు విస్తృతంగా ప్రచారం చేపట్టారు.
అదృష్టం వరించేనా!
నస్పూర్: ఈనెల 11న జరిగే మున్సిపల్ కార్పొరేషన్ బరిలో నస్పూర్‌కు చెందిన అగల్‌డ్యూటి రాజు, భార్య రాణి నిలిచా రు. 34వ వార్డు నుంచి అగల్‌డ్యూటి రాజు, 36వ వార్డు నుంచి అగల్‌డ్యూటి రాణి కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అగల్‌డ్యూటి రాజు గతంలో నస్పూర్ ము న్సిపాలిటీలో కౌన్సిలర్‌గా పనిచేశాడు.
బరిలో భార్యాభర్తలు
బరిలో భార్యాభర్తలు
బరిలో భార్యాభర్తలు
బరిలో భార్యాభర్తలు
బరిలో భార్యాభర్తలు


