మందమర్రిలో 80 శాతం బొగ్గు ఉత్పత్తి
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలో జనవరిలో 80 శాతం బొగ్గు ఉత్పత్తి జరిగిందని జీఎం ఎన్.రాధాకృష్ణ తెలిపారు. శనివారం జీఎం కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఉత్పత్తి వివరాలు వెల్లడించారు. శాంతఖనిలో 11,170 టన్నులు, కేకే–5లో 20,185, కాసిపేట 13,049, కాసిపేట–2లో 11,956, కేకే ఓసీ 1,58,675 టన్నులు బొగ్గు ఉత్పత్తి అయినట్లు తెలిపారు. అలాగే ఈ ఆర్థిక సంవత్సరం ఏరియాలో 65 శాతం బొగ్గు ఉత్పత్తి జరిగినట్లు జీఎం వెల్లడించారు. మందమర్రి ఏరియాలోని భూగర్భ గనుల్లో పలువురు కార్మికులు గైర్హాజరు కావడం వల్ల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలుగుతుందని తెలిపారు. ఇప్పటికే గైర్హాజరు కార్మికులు పలు మార్లు కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. సంస్థ నిర్ధేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు ఇంకా రెండు నెలలు సమయం ఉందని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్‌వోటూ జీఎం లలితేంద్ర ప్రసాద్, డీజీఎం (పర్సనల్) అశోక్, ఏరియా ఇంజినీర్ బాలాజీ భగవతి, ఐఈడీ కిరణ్‌కుమార్, సివిల్ ఎస్‌ఈ శ్రీధర్, సీనియర్ పీవో సత్యనారాయణ పాల్గొన్నారు.
సోషల్‌మీడియాలో పోస్టుచేసిన వ్యక్తిపై కేసు
ఆదిలాబాద్‌టౌన్: మున్సిపల్ ఎన్నికల సందర్బంగా సోషల్‌మీడియాలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా పోస్టు పెట్టిన వ్యక్తిపై శనివారం కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్‌కుమార్ తెలిపా రు. పట్టణంలోని ఒడ్డెరకాలనీకి చెందిన దుండుగుల నాగన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోస్ట్ చేయడంపై ఆ పార్టీ నాయకుడు ఎంఏ ఖ య్యూం ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఎవరైన సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామన్నారు.


