మ్యాపింగ్‌ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

మ్యాపింగ్‌ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి

Feb 1 2026 3:37 AM | Updated on Feb 1 2026 3:37 AM

మ్యాపింగ్‌ ప్రక్రియ  పకడ్బందీగా చేపట్టాలి

మ్యాపింగ్‌ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి

● రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి

● రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి

మంచిర్యాలఅగ్రికల్చర్‌: ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటరు జాబితా మ్యాపింగ్‌ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారి, కలెక్టర్‌, ఈఆర్‌వోలతో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌కు ముందుగా చేపట్టిన మ్యాపింగ్‌ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ బూత్‌ స్థాయి అధికారులకు సహాయ సహకారాలు అందిస్తూ మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బూత్‌ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి మ్యాపింగ్‌ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడి ఆయా పార్టీల నుంచి బూత్‌ స్థాయి ఏజెంట్లను నియమించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మాట్లాడుతూ జిల్లాలోని బూత్‌ స్థాయి అధికారులు ప్రతీ ఇంటికి వెళ్లి పరిశీలిస్తారని తెలిపారు. మ్యాపింగ్‌ పకడ్బందీగా నిర్వహించేలా పర్యవేక్షిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ చంద్రకళ, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement