జాతర ప్రారంభం
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ ఆర్‌కే–1ఏ గని సమీపంలోని పాలవాగు ఒడ్డున నిర్వహిస్తున్న జాతరలో భాగంగా మంగళవారం కంకవనాన్ని తీసుకువచ్చారు. గని ఆవరణ నుంచి డప్పుచప్పుళ్ల మధ్య కంకవనాన్ని తీసుకువచ్చి జాతర ప్రాంగణంలోని సమ్మక్క, సారల మ్మ, పగిడిద్దెరాజు గద్దెలపై ప్రతిష్ఠించారు. మూడురోజులు నిర్వహించనున్న జాతరలో కార్మికులు, వారి కుటుంబసభ్యులు అధికసంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకోనున్నా రు. ఏరియా జీఎం రాధాకృష్ణ, ఎస్వోటూ జీ ఎం ప్రసాద్, ఏఐటీయూసీ నాయకులు అక్బర్‌అలీ, సలెంద్ర సత్యనారాయణ, డీజీఎం పర్సనల్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.


