పట్టణాల్లో ఓట్ల జాతర!
మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా
అమలులోకి వచ్చిన ఎలక్షన్ కోడ్
నేటి నుంచే నామినేషన్లు స్వీకరణ
ప్రచార సమయం వారం రోజులే..
టికెట్ల కోసం ఆశావహుల నిరీక్షణ
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పురపాలక సంఘాల్లో ఎన్నికల జాతర మొదలైంది. ఓ వైపు సమ్మక్క–సారలమ్మ జాతర కొనసాగుతుండగా, మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని షెడ్యూల్ విడుదల చేయడంతో ఒక్కసారిగా పట్టణాల్లో రాజకీ యం వేడెక్కింది. ఎన్నికల కోడ్ అమలులోకి రావ డంతో జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు బెల్లంపల్లి, చెన్నూరు, లక్సెట్టిపేట, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో ఆంక్షలూ అమలులోకి వచ్చాయి. బుధవారం వార్డుల వారీగా నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. దీంతో ఆశావహులు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. తుదిగా బరిలో దిగి న వారి నుంచి పోలింగ్ వరకు ప్రచార సమయం వారం రోజులే ఉంది. దీంతో పార్టీ టికెట్లు ఖరారైన చోట అభ్యర్థులు ఇప్పటికే ఇంటింటి ప్రచారం మొదలు పెట్టారు. అన్నింటికీ డబ్బుతోనే పని కావడంతో ఆర్థిక వనరులను సమీకరించుకున్నారు.
తెగని టికెట్ల పంచాయితీ!
నామినేషన్ల దాఖలకు మూడురోజులే ఉంది. నామి నేషన్ వేసినా బీ ఫాం ఇస్తేనే పార్టీ అభ్యర్థిగా చెల్లుబాటవుతుంది. అధికార కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్, బీజేపీ, వామపక్ష పార్టీల్లో ఇంకా ఎక్కడా అధి కారికంగా అభ్యర్థులను ఖరారు చేయలేదు. బీ ఫాం చేతిలో పడేవరకు అభ్యర్థులకు టెన్షన్ తప్పడం లే దు. తప్పనిసరిగా బరిలో ఉంటామని చెప్పుకొంటూ టికెట్‌కు పోటీ ఉన్న చోట్ల నాయకులు బెంగతో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి చెన్నూరు, క్యా తనపల్లి మున్సిపాలిటీల పరిధిలో ఇప్పటికే జాబి తా ప్రకటించాల్సి ఉన్నా, ఇంకా జాప్యం చేస్తున్నా రు. మంచిర్యాల నగరపాలక సంస్థ, లక్సెట్టిపేట మున్సిపాలిటీలో ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు హామీ ఇచ్చినట్లు పలువురు ఆశావహులు డివిజన్లలో చె ప్పుకొంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అయితే, అఽధికార పార్టీ నుంచి సీనియర్ నాయకులు టికెట్ల కోసం సంప్రదిస్తే వారితో టచ్‌లో ఉంటున్నారు. బీ ఫాం రాకపోతే స్వతంత్రంగా బరిలోకి దిగడమా? పోటీ నుంచి విరమించుకోవడమా? లేక ప్రతిపక్ష పార్టీలోకి జంప్ కావడమా? అనే సందిగ్ధంతో వివి ధ పార్టీల ఆశావహులు ఎదురుచూస్తున్నారు.
అంతా సిద్ధం చేసిన యంత్రాంగం
జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో అధికార యంత్రాంగం నామినేషన్ కేంద్రాలు, స్ట్రాంగ్, కౌంటింగ్ రూంలు సిద్ధం చేసింది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 149 వార్డుల్లో 444 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఇందుకు 87మంది రిటర్నింగ్ ఆఫీస ర్లు, 178 మంది సహాయ రిటర్నింగ్ ఆఫీసర్లు, 533 మంది పోలింగ్ ఆఫీసర్లు, 2,131 మంది ఇతర పో లింగ్ ఆఫీసర్లు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. జిల్లాలో 87 కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ నేడు ప్రారంభం కానుంది. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఆధ్వర్యంలో పట్టణాల్లో సీఐల నేతృత్వంలో పటిష్ట పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఇదీ షెడ్యూల్
16న చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక
బెల్లంపల్లిలో టికెట్ల గోల
బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీలో 34వార్డులుండగా అధికార కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్‌లోనూ టికెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉంది. సొంత పార్టీ నుంచి టికెట్ రాని ఆశావహులు వా ర్డు లేదా పార్టీ మారాలా.. లేదా స్వతంత్రంగా బరిలోకి దిగాలా.. అనే కోణాల్లో ఆలోచిస్తున్నా రు. కాంగ్రెస్‌కు చెందిన ఆశావహులు పోటాపోటీగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ వద్ద ప్రయత్నం చే స్తున్నారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప ర్యవేక్షణలో బీఆర్‌ఎస్ ఏర్పాటు చేసిన ఫైవ్‌మెన్ కమిటీ ఈపాటికే వార్డుల వారీగా ఆశావహుల వివరాలు ఆరా తీసి ఓ అంచనాకు వచ్చింది. గె లుపు అవకాశాలున్న అభ్యర్థులను ఎంపిక చేసి కాంగ్రెస్ జాబితా ప్రకటించాకే బీఆర్‌ఎస్ జాబి తాను వెల్లడించాలనే వ్యూహంతో ఉన్నట్లు సమాచారం. సీపీఐ, బీజేపీ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. కాగా, ఎమ్మెల్యే వినోద్ తమకే టికెట్ ఖరారు చేశారని చెప్పుకొంటూ కొందరు కాంగ్రెస్ ఆశావహులు ప్రచారం మొదలు పెట్టారు. మరోవైపు బీఆర్‌ఎస్‌లో పలుచోట్ల అభ్యర్థులను ఖరారు చేశారు. బీజేపీలో పోటీ లేని చోట టికెట్లు ఖరారవుతున్నాయి.
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
31న నామినేషన్ల పరిశీలన
30వరకు నామినేషన్లు దాఖలు
ఫిభ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు


