● గోదావరి తీరం భక్త జనసంద్రం ● వనదేవతలను దర్శించుకున్న
దర్శనానికి బారులు తీరిన భక్తులు
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాలలోని గోదావరి తీరం భక్తజన సంద్రమైంది. గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో శివసత్తులు, మహిళల పూనకాలు, భక్తుల హర్షధ్వానాల మధ్య జాతర నిర్వహించే సమీపంలోని చిలుకల గుట్టగా భావించే తల్లుల ఇల్లారి(గుడి) వద్ద సమ్మక్క గద్దెకు చేరింది. మేడారం నుంచి వచ్చిన గిరిజన పూజారి సతీష్ నేతృత్వంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వీరనారి ప్రతిరూపమైన కుంకుమ భరిణె(అమ్మవారు)ను అశేష జనవాహిని తరలి రాగా డప్పు చప్పుళ్లు, టపాసుల మోత మధ్య పోలీసు వలయంలో ఊరేగింపుగా తీసుకొచ్చి గద్దైపె ప్రతిష్టించారు. సమ్మక్క రాక నేపథ్యంలో భక్తులు దారి పొడవునా బారులు తీరారు. అంతకుముందు సమ్మక్క–సారలమ్మ జాతరలో భాగంగా గురువారం వేకువజామున ఏకలవ్య ఆశ్రమం సమీపంలోని కంకవనం వద్ద గిరిజన పూజారి ప్రత్యేక పూజలు నిర్వహించి కంక వనాల(వెదురు కర్ర)ను డప్పు చప్పుళ్ల మధ్య జాతర జరిగే దేవతమూర్తి సమ్మక్క గద్దె వద్దకు తీసుకొచ్చి ప్రతిష్టించారు. గద్దెలపైన కొలువుదీరిన సమ్మక్క–సారలమ్మ దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. సమ్మక్కను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు దంపతులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో ముక్త రవి పాల్గొన్నారు.
జాతరకు పోటెత్తిన భక్తజనం
రామకృష్ణాపూర్: సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్ ఆర్‌కే1ఏ గని శివారులోని పాలవాగు వద్ద సమ్మక్క జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య గురువారం సాయంత్రం సమ్మక్కను గద్దెకు తీసుకొచ్చారు. మందమర్రికి చెందిన దూలం కనకయ్య ఇంటి నుంచి సమ్మక్కను ఊరేగింపుగా జాతర ప్రాంగణానికి తీసుకువచ్చి గిరిజన పూజారులు గద్దైపె ప్రతిష్టించారు. జాతర ప్రాంతం జనసంద్రమైంది. కార్మిక కుటంబాలతోపాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఎత్తు బెల్లాలను సమర్పించుకున్న భక్తులు పూనకాలతో ఊగిపోయారు.
అమ్మవార్ల దీవెనలు అందరిపై
ఉండాలి: మంత్రి వివేక్
సమ్మక్క–సారలమ్మల దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు. ఆర్‌కే1ఏ గని పాలవాగు వద్ద సమ్మక్క జాతరకు గురువారం రాత్రి ఆయన హాజరై మొక్కులు చెల్లించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సింగరేణిలో కొత్త గనుల ఏర్పాటు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పారు. మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ, ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ఎస్‌ఓటు జీఎం జీఎల్ ప్రసాద్, డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఆయా యూనియన్లు, రాజకీయ పార్టీల నాయకులు వేర్వేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించారు.
● గోదావరి తీరం భక్త జనసంద్రం ● వనదేవతలను దర్శించుకున్న
● గోదావరి తీరం భక్త జనసంద్రం ● వనదేవతలను దర్శించుకున్న
● గోదావరి తీరం భక్త జనసంద్రం ● వనదేవతలను దర్శించుకున్న


