నేటి నుంచి ఇంటర్ ప్రయోగ పరీక్షలు
మంచిర్యాలఅర్బన్: ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూపు విద్యార్థులకు నేటి నుంచి 11వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. అధికారులు జిల్లా వ్యాప్తంగా 20పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా అన్ని చోట్ల సీసీ కె మెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 9నుంచి 12వరకు, మధ్యాహ్నం 2నుంచి 5గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ 65 జనరల్, వృత్తివిద్య జూనియర్ కళాశాలలున్నా యి. ప్రాక్టికల్స్ రాసే విద్యార్థులు 5,398 మంది ఉండగా, ఇందులో ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులు 3,726 మంది, ప్రథమ, ద్వితీయ సంవత్స రం వొకేషనల్ విద్యార్థులు 1,672 మంది ఉన్నారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు ఉండేలా చూడాల ని అధికారులు ఆదేశించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు విడుదల చేసిన నిధులతో అవసరమైన పరికరాలు, రసాయనాలు అందుబాటులో ఉంచారు. ప్రయోగ, రాత పరీక్షలన్నీ సీసీ కెమెరాల నిఘాలో నిర్వహిస్తారు. ప్రతీ కళాశాలకు నాలుగు కెమెరాలు అమర్చి ఇంటర్ బోర్డుకు అనుసంధానించారు. వీరితో పాటు ఎగ్జామినర్లు, డిపార్ట్‌మెంట్ అధికారులు, ఫ్లయింగ్‌స్క్వాడ్ బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నాయి. సెల్ఫ్ కేంద్రాల్లో ప్ర యోగ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెండు పూ టలా పరీక్షలు నిర్వహించనున్నారు. ఎగ్జామినర్ మి నహా మరెవరికి అక్కడా అవకాశం లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 2నుంచి 6వరకు మొదటి విడత, 7నుంచి 11వరకు రెండో విడతలో ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ కన్వీనర్‌గా డీఐఈవో అంజయ్య, ఇద్దరు సభ్యులు ఎప్పటికప్పు డు కేంద్రాలను తనిఖీ చేయనున్నారు. కేంద్రాల్లో వి ద్యుత్, ఇంటర్నెట్ సరఫరాలో అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టనట్లు డీఐఈవో అంజయ్య తెలిపారు. పరీక్షాకేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు. విద్యార్థులు కళాశాలల్లో హాల్‌టికెట్లు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు అరగంట ముందు సంబంధిత పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రం డౌన్‌లోడ్ చేసుకునేలా ప్రభుత్వం ని బంధనలు తెచ్చింది. ఆయా సీఎస్‌లకు ఆన్‌లైన్‌లో పరీక్ష సమయానికి అరగంట ముందు పంపుతారు.


