కాంగ్రెస్‌ గెలుపుతో కోల్‌బెల్ట్‌ అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ గెలుపుతో కోల్‌బెల్ట్‌ అభివృద్ధి

Feb 2 2026 8:01 AM | Updated on Feb 2 2026 8:01 AM

కాంగ్రెస్‌ గెలుపుతో కోల్‌బెల్ట్‌ అభివృద్ధి

కాంగ్రెస్‌ గెలుపుతో కోల్‌బెల్ట్‌ అభివృద్ధి

● ఐఎన్‌టీయూసీ సెక్రెటరీ జనరల్‌ జనక్‌ప్రసాద్‌

శ్రీరాంపూర్‌: కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తే కోల్‌బెల్ట్‌ ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసుకోవచ్చని ఐఎన్‌టీయూసీ సెక్రెటరీ జనరల్‌ బి.జనక్‌ప్రసాద్‌ తెలిపారు. ఆదివారం ఆయన మంచిర్యాల కార్పొరేషన్‌ పరిధి నస్పూర్‌ కాలనీ, షిర్కే ప్రాంతంలోని 34, 36 డివిజన్లలో కాంగ్రెస్‌ అభ్యర్థులు అగల్‌డ్యూటీ రాజు, అగల్‌డ్యూటీ రాణికు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డుల్లో తిరుగుతూ కార్మిక కుటుంబాల ఓట్లను అభ్యర్థించారు. వారిని ఆదరించి అభ్యర్థులను గెలిపించాలన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో ఐఎన్‌టీయూసీ కృషి చేస్తోందన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతున్నామన్నారు. కార్యక్రమంలో పార్టీ అభ్యర్థులు అగల్‌డ్యూటీ రాజు, రాణి, ఐఎన్‌టీయూసీ కేంద్ర ఉపాధ్యక్షుడు శంకర్‌రావు, కేంద్ర కమిటీ నాయకులు గరిగే స్వామి, కలవేని శ్యాం, ఏనుగు ర వీందర్‌రెడ్డి, తిరుపతిరాజు, ల్యాగల శ్రీనివాస్‌, రా వుల అనిల్‌, జయభరత్‌రెడ్డి, మనోజ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement