ఘరానా మోసగాడి రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

ఘరానా మోసగాడి రిమాండ్‌

Feb 3 2026 7:51 AM | Updated on Feb 3 2026 7:51 AM

ఘరానా మోసగాడి రిమాండ్‌

ఘరానా మోసగాడి రిమాండ్‌

● 15 మంది నుంచి రూ.40 లక్షల వరకు దండుకున్న వైనం

ఆదిలాబాద్‌టౌన్‌: ఘరాన మోసగాడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూటౌన్‌ సీఐ నాగరాజు తెలిపారు. సోమవారం పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌లోని మలక్‌పేటకు చెందిన చిత్తూరి రాజశేఖర్‌ ఆదిలాబాద్‌ పట్టణానికి చెందిన బాధితుడు గాజుల అనిల్‌ను నమ్మించి ఫ్రాంచైజ్‌లో సభ్యత్వం ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నాడు. సరుకులు సరఫరా చేయకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిని అరెస్టు చేసి విచారించగా బోయన్‌పల్లికి చెందిన ద్వారకనాథ్‌ నుంచి రూ.2.50 లక్షలు, మెడ్చల్‌కు చెందిన శశికాంత్‌ నుంచి రూ.4.60 లక్షలు, కల్వకుర్తికి చెందిన ప్రవీణ్‌ వద్ద నుంచి రూ.4లక్షలు, వరంగల్‌కు చెందిన శివ నుంచి రూ.4లక్షలు, నర్సంపేటకు చెందిన వంశీగౌడ్‌ నుంచి రూ.2లక్షలు, ఆదోనికి చెందిన గౌతమ్‌ నుంచి రూ.4లక్షలు, నేరెడిమెట్‌కు చెందిన హరికృష్ణ నుంచి రూ.3లక్షలు, మహబూబ్‌నగర్‌కు చెందిన రఘురాం నుంచి రూ.4లక్షలు, ఘట్‌కేసర్‌కు చెందిన శ్రీను నుంచి రూ.4లక్షలు, కసాయిగూడకు చెందిన వెంకటేష్‌ నుంచి రూ.4లక్షలు, హిందూపురంకు చెందిన పవన్‌ నుంచి రూ.2లక్షలు, చైన్నెకు చెందిన పుష్పాంజలి నుంచి రూ.2లక్షలు, కూకట్‌పల్లికి చెందిన గోపిచంద్‌ నుంచి రూ.19 లక్షలు వసూలు చేసి సొంతానికి వాడుకున్నట్లు ఒప్పుకున్నాడు. ప్రజలు ప్రాంచెస్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో ఎస్సై విష్ణుప్రకాష్‌, సిబ్బంది కోటేశ్వర్‌రావు, నరేందర్‌లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement