టేకు చెట్లు నరికిన ఇద్దరి రిమాండ్
జన్నారం: జన్నారం అటవీ డివిజన్ తాళ్లపేట్ అటవీ రేంజ్ పరిధిలో అక్రమంగా టేకు చెట్లు నరికిన ఇద్దరిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు రేంజ్ అధికారి సుష్మారావు తెలిపారు. జన్నారం మండలం తపాలపూర్‌కు చెందిన ఐతే నాగరాజు, దుర్గం శ్రీనివాస్ ఇటీవల పలుమార్లు అడవికి వెళ్లి టేకు చెట్లు నరకడం, తరలించడం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితులను అరెస్ట్ చేసి లక్సెట్టిపేట కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు.


