పుట్టు సుబ్బరాంపల్లి మెట్టు మేడారం
చెన్నూర్‌రూరల్: మండలంలోని సుబ్బరాంపల్లిలో 50 ఏళ్లకు పైగా జాతర నిర్వహిస్తున్నారు. ఏటా పౌర్ణమికి కూడా జాతర నిర్వహిస్తారు. మంథని, కరీంనగర్, మహారాష్ట్రలోని చంద్రపూర్, రాజూరా, అంకీస, అసరెల్లి ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. మొదట మారిశెట్టి రామయ్య పూజలు చేసేవాడు. ఆయన తదనానంతరం కూతురు, అల్లుడు తనుగుల మల్లక్క, లచ్చన్న పూజలు చేస్తున్నారు.ఈప్రాంతం పుట్టు సుబ్బ రాంపల్లి.. మెట్టు మేడారంగా పేరొందింది. వీ టితో పాటు కిష్టంపేట గ్రామ సమీపంలో జా తీయ రహదారిపై జాతర నిర్వహించేందుకు అంతా సిద్ధం చేశారు.


