‘పెర్సపేన్’ అభివృద్ధికి కృషి చేద్దాం
ఇంద్రవెల్లి: పెర్సపేన్ కులదేవత ఆలయ అభివృద్ధికి కృషి చేద్దామని జుగ్నాక వంశానికి చెందిన కటోడ జుగ్నాక మహదు, జుగ్నాక్ జైతు అన్నారు. మంగళవారం మండలంలోని పొల్లుగూడలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జుగ్నాక వంశీయులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగోబా ఆలయ అభివృద్ధితో పాటు నూతనంగా నిర్మించిన సతీ దేవతల ఆలయ ప్రారంభ కార్యక్రమంపై చర్చించారు. సమావేశంలో జుగ్నాక వంశీయులు కాశీరాం, భరత్, మానిక్‌రావ్, మాదోరావ్, తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందినట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. బీహార్ రాష్ట్రంలోని పాట్నా జిల్లా దౌలతాపూర్‌లోని ఖస్పూర్ గ్రామానికి చెందిన దేవ్‌జీత్‌కుమార్ (26) పెద్దపల్లి జిల్లా అంతర్‌గాంలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం ట్రాలీ ఆటోలో మంచిర్యాలకు వెళ్తుండగా వేంపల్లి సమీపంలో అతివేగంగా వచ్చిన గూడ్స్ కారియర్ వెనక నుంచి ఢీ కొట్టింది. దేవ్‌జీత్‌కుమార్ సంఘటన స్థలంలోనే మృతి చెందగా మరో ప్రయాణికుడు కేసిరెడ్డి రాంరెడ్డికి తీవ్రంగా సింగం అరవింద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాంరెడ్డిని మెరుగైన చికిత్సకోసం కరీంనగర్‌కు తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని సోదరుడు సన్నీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. గూడ్స్ కారియర్ డ్రైవర్ పారిపోతుండగా అటుగా వెళ్తున్న ఏసీబీ అధికారి వాహనం వెంబడించి పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కారియర్‌ను స్టేషన్‌కు తరలించారు.
బాడీ బిల్డింగ్ పోటీల్లో సత్తా
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్‌లో ఇటీవల నిర్వహించిన వెంకీ క్లాసిక్ బాడీ బిల్డింగ్ పోటీల్లో మంచిర్యాల చాంపియన్ జిమ్ బాడీ బిల్డర్లు సత్తా చాటారు. ఎం.వెంకటేశ్ మిస్టర్ మంచిర్యాల, మిస్టర్ ఆదిలాబాద్ టైటిళ్లను గెలుచుకున్నారు. పి.విశ్వనాథ్ 75 కిలోల కేటగిరీలో 5వ స్థానం, మాస్టర్స్ కేటగిరీలో 2వ స్థానం, ప్రదీప్ 65 కిలోల విభాగంలో 4వ స్థానం, రాజు 50 కిలోల విభాగంలో 4వ స్థానం సాధించారు. జిమ్ యజమాని కంబగోని సుదర్శన్‌గౌడ్, సీనియర్ బాడీ బిల్డర్లు, కోచ్ సాగర్‌గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు.
‘పెర్సపేన్’ అభివృద్ధికి కృషి చేద్దాం


