చైన్నెలో గుస్సాడీ నృత్య ప్రదర్శన
ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని దూబార్‌పేట్ గ్రామానికి చెందిన ఆదివాసీ కళాకారులు సోమవారం రాత్రి చైన్నెలో జరిగిన కార్యక్రమంలో గుస్సాడీ నృత్య ప్రదర్శన చేసి ప్రేక్షకులను అలరించారు. దక్షిణ చిత్రహెరిటేజ్ మ్యూజియంలో మార్గళి విలేజ్ ఫెస్టివల్ కార్యక్రమంలో ఆదివాసీ కళాకారులు గుస్సాడీ నృత్య ప్రదర్శన చేసినట్టు ఆదివాసీ సకల కళా సంక్షేమ సంఘం డైరెక్టర్ కాత్లే శ్రీధర్ తెలిపారు. ఈ ప్రదర్శనలో కళాకారులు తిరుపతిమాలిక్, రాము, జుగాదిరావు, నగేష్, సంజీవ్, పరశురాం, విశ్వనాథ్, సందీప్, గంగారాం, వినోద్ పాల్గొన్నారు.


