మహారాష్ట్ర నుంచి భక్తుల రాక
కాగజ్‌నగర్‌టౌన్: వంజీరి గ్రామ పంచాయతీ పరిధి నందిగూడ శివారులోని పెద్దవాగు ఒ డ్డు న 2018 నుంచి సమ్మక్క, సారలమ్మ జాతర నిర్వహిస్తున్నారు. పెద్దవాగు సమీపంలో ఇస్తా రి పటేల్ కుటుంబ సభ్యులు అమ్మవార్లకు దా నంగా ఇచ్చిన భూమిలో కమిటీ ఆధ్వర్యంలో పదేళ్లుగా జాతర నిర్వహిస్తున్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచే కాకుండా కౌ టా ల, చింతలమానెపల్లి, సిర్పూర్(టి), దహెగా ం, ఆసిఫాబాద్, రెబ్బెన, బెల్లంపల్లి, మహా రా ష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు.


