నాగోబా ఆదాయం రూ.20.74 లక్షలు
ఇంద్రవెల్లి: మెస్రం వంశీయుల ఆరాధ్యదైవం ఈ నెల 18 నుంచి నిర్వహించిన నాగోబా జాతర ఆదాయం 20 లక్షల 74 వేల 797 రూపాయలు వచ్చిందని దేవాదాయ శాఖ ఈవో ముక్త రవి తెలిపారు. మంగళవారం మెస్రం వంశీయులు, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో హుండీని లెక్కించారు. తైబజర్ ద్వారా రూ.11,81,000, హుండీ ద్వారా రూ.8,93,797 ఆదాయం, మిశ్రమ వెండి 252 గ్రాములు వచ్చినట్లు ఈవో ముక్త రవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రవీణ్, నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్, కేస్లాపూర్ మెస్రం తుకారాం, నాగోబా ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం ఆనంద్‌రావ్, మెస్రం వంశీయులు కోసేరావ్, దాదారావ్, నాగ్‌నాథ్, మెస్రం వంశ ఉద్యోగులు దేవ్‌రావ్, శేఖర్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.


