ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ
నస్పూర్: మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలింగ్ సిబ్బంది రాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో రాండమైజేషన్ ప్రక్రియ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అధికారులకు అవసరమైన శిక్షణ అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
నామినేషన్ల కేంద్రం పరిశీలన
కలెక్టరేట్‌లో నామినేషన్ల్ స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ ఏఓ పిన రాజేశ్వర్, కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్‌తో కలిసి సందర్శించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా కంట్రోల్ రూం నంబరు 08736–250501 ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు.


