నామినేషన్ పత్రాలను పరిశీలించాలి
చెన్నూర్: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నామినేషన్ పత్రాలను క్షుణంగా పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు కె.గంగాధర్ అన్నారు. చెన్నూర్ మైనార్టీ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. నామినేషన్ల స్వీకరణను పరిశీలించి ఆర్వోలతో వివరాలు తెలుసుకున్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రశాంతంగా సాగుతోందని, అభ్యర్థులకు ఇబ్బందులు కలుగకుండా స్వీకరిస్తున్నామని తెలిపారు. చెన్నూర్ మున్సిపల్ ఎన్నికల ప్రత్యేకాధికారి కిషన్, మున్సిపల్ కమిషనర్ మురళికృష్ణ, సీఐ బన్సీలాల్ పాల్గొన్నారు.


