బాడీ బిల్డర్‌కు సన్మానం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఇటీవల న స్పూర్‌లో నిర్వహించిన వెంకీ క్లాసిక్ బాడీ బి ల్డింగ్ టైటిల్ సాధించి ఓవరాల్ ఛాంపియన్ షిప్ కై వసం చేసుకున్న మాసు వెంకటేశ్‌ను ఆది వారం మంచిర్యాల ఛాంపియన్ జిమ్‌లో సన్మానించారు. సీనియర్ బాడీ బిల్డర్లు కొలిపాక బక్కయ్య, ఆసిఫాబాద్ తహసీల్దార్ శశిధర్, కోచ్ విద్యాసాగర్‌గౌడ్, జిమ్ సభ్యులు దుర్గం ప్రవీణ్, వర్మణి వెంకటేశ్వర్లు, గట్టు శ్యాంకుమార్, శ్రీకాంత్, రాజనాథం, తిరుపతి, అర్జున్, శశిపటేల్, శ్రీనివాస్ నగదు బహుమతి అందించి పూలమాలతో సన్మానించారు.
సాఫ్ట్‌బాల్ కెప్టెన్‌గా డానియల్
మంచిర్యాలఅర్బన్: కాకతీయ యూనివర్సిటీ సాఫ్ట్‌బాల్ కెప్టెన్‌గా స్థానిక మిమ్స్ డిగ్రీ కళాశాల విద్యార్థి డానియల్ ఎంపికయ్యాడు. ఈనెల 2నుంచి 5వరకు మహారాష్ట్రలో నిర్వహించే ఆల్ ఇండియా యూనివర్సిటీ పోటీలకు యూనివర్సిటీ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఎంపీసీఎస్ ఫైనలియర్ జట్టు సభ్యుడిగా సాయికమల్ ఎంపికైనట్లు కరస్పాండెంట్ శ్రీని వాసరాజు, ప్రిన్సిపాల్ ఉపేందర్‌రెడ్డి తెలిపారు.


