సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలి | - | Sakshi
Sakshi News home page

సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలి

Feb 3 2026 7:49 AM | Updated on Feb 3 2026 7:49 AM

సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలి

సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలి

మంచిర్యాలటౌన్‌: నూతనంగా జిల్లాకు ఎంపికై న 71మంది ల్యాబ్‌ టెక్నీషియన్లు విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ అనిత అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో సోమవారం ల్యాబ్‌ టెక్నీషియన్లకు శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమయపాలన పాటించాలని, తెలంగాణ డయోగ్నస్టిక్స్‌కు రక్త నమూనాలను సరైన మోతాదులో పంపించాలని తెలిపారు. ఆయా వివరాలన్నీ రిజిష్టరులో, ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. రోగి అడ్రస్‌, మొబైల్‌ నంబర్‌ను తీసుకుని, బార్‌కోడ్‌ను సక్రమంగా నమోదు చేస్తే పరీక్షా ఫలితాలు నేరుగా రోగి మొబైల్‌ నంబర్‌కు వెళ్తాయని అన్నారు. మలేరియా, డెంగీ, గర్భిణుల పరీక్షల కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్‌ సుధాకర్‌నాయక్‌, టీ హబ్‌ మేనేజర్‌ వెంకటేశ్‌, సీనియర్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ రమేశ్‌, సీహెచ్‌వోలు వెంకటేశ్వర్లు, నాందేవ్‌, శ్రీనివాస్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ అల్లాడి శ్రీనివాస్‌, డీపీహెచ్‌ఎన్‌ పద్మ మార్త, జిల్లా మాస్‌ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement