ప్రాక్టికల్‌ పరీక్షలకు 170 మంది గైర్హాజరు | - | Sakshi
Sakshi News home page

ప్రాక్టికల్‌ పరీక్షలకు 170 మంది గైర్హాజరు

Feb 3 2026 7:49 AM | Updated on Feb 3 2026 7:49 AM

ప్రాక్టికల్‌ పరీక్షలకు 170 మంది గైర్హాజరు

ప్రాక్టికల్‌ పరీక్షలకు 170 మంది గైర్హాజరు

మంచిర్యాలఅర్బన్‌: ఇంటర్మీడియెట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలకు మొదటి రోజు సోమవారం 170 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 20 పరీక్షా కేంద్రాల్లో రెండు పూటలు పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు నిర్వహించిన పరీక్షలకు 1279 మందికి గాను 1161 మంది హాజరుకాగా 118 మంది గైర్హాజరయ్యారు. జనరల్‌ విద్యార్థులు 604 మందికి గాను 589 మంది హాజరు కాగా 15 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్‌లో 675 మందికి 572 మంది హాజరు కాగా 103 గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు నిర్వహించిన ప్రాక్టికల్‌కు 1099 మందికి 1047 మంది హాజరు కాగా 52 మంది గైర్హాజరయ్యారు. జనరల్‌ 537 మందికి 516 హాజరు కాగా 21 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్‌ విద్యార్థులు 562 మందికి 531 హాజరు కాగా 31 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను డీఐఈవో అంజయ్య పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement