నాటి తాలూకా.. నేటి బల్దియా | - | Sakshi
Sakshi News home page

నాటి తాలూకా.. నేటి బల్దియా

Feb 3 2026 7:49 AM | Updated on Feb 3 2026 7:49 AM

నాటి తాలూకా.. నేటి బల్దియా

నాటి తాలూకా.. నేటి బల్దియా

● ఆది నుంచీ అదే భవనం ● దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన లక్సెట్టిపేట

లక్సెట్టిపేట: లక్సెట్టిపేట తాలూకా నుంచి గ్రామ పంచాయతీగా ఆ తర్వాత మున్సిపాల్టీగా ఏర్పడింది. దశాబ్దాల క్రితం నాటి పంచాయతీ కార్యాలయ భవనమే నేటి మున్సిపల్‌ కార్యాలయం గానూ కొనసాగుతోంది. 1956లో లక్సెటిపేటను తాలూకా కేంద్రంగా ఏర్పాటు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని అంగడిబజార్‌లోని పెంకుటింట్లో కొద్ది సంవత్సరాలు కొనసాగించారు. మొదటి సర్పంచ్‌గా సాంబశివరావు పని చేసినట్లు పూర్వీకులు చెబుతున్నారు. 1961లో పంచాయతీ రాజ్‌ వ్యవస్థ ప్రారంభం కావడంతో నూతన పంచాయతీ కార్యాలయాన్ని నిర్మించి గ్రామ పంచాయతీ వ్యవస్థను పునః ప్రారంభించారు. అప్పట్లో నూనె పెద్దన్న సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 2018వరకు సర్పంచ్‌లతో కొనసాగగా.. చివరిగా మినుముల సుమతి సర్పంచ్‌గా పని చేశారు. లక్సెట్టిపేట పట్టణాన్ని ఇటిక్యాల, ఊత్కూరు, మోదెల గ్రామ పంచాయతీలను కలుపుతూ 2018 ఆగస్టు 2న అప్పటి ప్రభుత్వం మున్సిపాల్టీగా ప్రకటించింది. గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం బోర్డును మార్చి అందులోనే మున్సిపాల్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. పురాతన కాలం నాటి భవనం కావడంతో ప్రస్తుతం సరిపోవడం లేదు. మున్సిపల్‌ మొదటి చైర్మన్‌గా నల్మాసు కాంతయ్య, వైస్‌ చైర్మన్‌గా పోడెటి శ్రీనివాస్‌ పని చేశారు. ప్రస్తుతం రెండోసారి మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement