‘పది’ విద్యార్థులకు టాలెంట్ పరీక్ష
మంచిర్యాలఅర్బన్: జిల్లా సాంఘిక శాస్త్ర ఫోరం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు సోషల్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 80 ప్రభుత్వ పాఠశాలల నుంచి 173 మంది హాజరయ్యారు. తెలుగు మీడియం నుంచి జెడ్పీహెచ్‌ఎస్ నీల్వాయికి చెందిన అక్షిత(ప్రథమ), జెడ్పీహెచ్‌ఎస్ చింతగూడకు చెందిన వైష్ణవి(ద్వితీయ), కేజీబీవీ బెల్లంపల్లికి చెందిన శ్రీవాణి(తృతీయ), ఇంగ్లిష్ మీడియంలో మోడల్‌స్కూల్ మంచిర్యాలకు చెందిన సాయిహర్ష(ప్రథమ), జెడ్పీహెచ్‌ఎస్ కలమడుగుకు చెందిన జశ్వంత్(ద్వితీయ), జెడ్పీహెచ్‌ఎస్ దండేపల్లికి చెందిన జస్విత్, కలమడుగు జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన ఆంజనేయప్రసాద్(తృతీయ బహుమతి) సాధించారు. విజేతలకు డీఈవో యాదయ్య బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సెక్టోరల్ అధికారులు సత్యనారాయమూర్తి, భరత్‌కుమార్, సాంఘిక శాస్త్ర ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు మహేష్, మధుకర్, కోశాధికారి రమేశ్‌కుమార్, జెడ్పీ హెచ్‌ఎస్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బండి రమేష్ పాల్గొన్నారు.


