అభ్యర్థుల జాబితా తయారు చేయాలి | - | Sakshi
Sakshi News home page

అభ్యర్థుల జాబితా తయారు చేయాలి

Feb 3 2026 7:49 AM | Updated on Feb 3 2026 7:49 AM

అభ్యర్థుల జాబితా తయారు చేయాలి

అభ్యర్థుల జాబితా తయారు చేయాలి

● జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

చెన్నూర్‌: మున్సిపల్‌ ఎన్నికల నిబంధనల ప్రకారం మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిన తర్వాత పోటీలో ఉండే అభ్యర్థుల జాబితా పకడ్బందీగా తయారు చేయాలని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. సోమవారం స్థానిక నామినేషన్‌ కేంద్రాన్ని సందర్శించారు. అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిష్కారంపై అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ 18 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ నెల 11న పోలింగ్‌, 12న రీపోలింగ్‌ ఉంటే నిర్వహిస్తామని, 13న ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత విజేతల వివరాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. అనంతరం 100 పడకల ఆసుపత్రి, అమృత్‌ 2.0 నిర్మాణం పనులు పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని సూచించారు. కస్తూర్బా పాఠశాలను సందర్శించి విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, పది పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని తెలిపారు. సబ్జెక్‌ ఉపాధ్యాయులు ఉత్తమ ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement