గౌరపూర్‌లో మెస్రం వంశీయుల పూజలు
ఇంద్రవెల్లి: మండలంలోని గౌరపూర్ గ్రామ సమీపంలో గల పశువుల దొడ్డి వద్ద మంగళవారం మెస్రం వంశీయులు ప్రత్యేక పూజలు చేశారు. కేస్లాపూర్ నాగోబా మహాపూజతో పాటు ఉట్నూర్ మండలంలోని శ్యాంపూర్ బుడుందేవ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మెస్రం వంశీయులు తిరుగు ప్రయాణంలో తమ ఆచారం ప్రకారం గౌరపూర్ పశువుల దొడ్డి వద్ద పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడ పూజలు చేసిన తర్వాతే తమ గ్రామాలకు వెళ్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌరపూర్ సర్పంచ్ కోవా లాల్‌షావ్, మెస్రం దేవ్‌రావ్ పటేల్, కటోడ జంగు, మెస్రం సీతారాం డాకలి పటేల్, జంగు, మధవార్, మెస్రం జంగుకటోడ, తదితరులు పాల్గొన్నారు.


