నాటి ఎన్నికలే వేరు..
మంచిర్యాలటౌన్: గతంలో ఎన్ని కలంటే పార్టీలు, అభ్యర్థులను చూసి ఓటేసి గెలిపించేవారు. కా నీ మారుతున్న కాలంలో శ్రీఎవరు ఎక్కువగా ఖర్చు చేస్తే వారికే గెలుపు అవకాశాలుశ్రీ అన్నట్లుగా ఎన్నికలు మారిపోయాయి. సర్పంచ్ ఎన్నికల నుంచి మొదలు ఎంపీ, ఎమ్మెల్యే వరకు డ బ్బే ప్రధానంగా మారుతోంది. ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుని, ప్రజాసేవకు అంకితం అయ్యేవారిని ప్రజలు స్వయంగా ఎన్నికల బరిలో ఉంచి మరీ గెలిపించుకున్న రోజుల నుంచి ఎన్నికల్లో ఆ యా పార్టీల టికెట్‌లను పొందేందుకు ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు పడిగాపులు కాయాల్సిన పరిి స్థతి ఏర్పడింది. ఎన్నికల నిర్వహణ ఖర్చు రూ.10 వేల నుంచి రూ.కోటికి పెరిగిందంటే ఎన్నికలు ఎంత ఖరీదుగా మారాయో తెలుస్తోంది. ఎన్నికల కో సం పనిచేసే వారికి చేసే ఖర్చు మాత్రమే గతంలో ఉండేది. ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు ఓటుకు ఇంతా అని లెక్కలేసి పంచాల్సిన పరిస్థితి. అభ్యర్థులు ఇచ్చే డబ్బుకో ఇంకా దేనికో ఆశించి ఓటును అమ్ముకోకుంటేనే ఆ ప్రాంతం అభివృద్ధిలో ముందుకు వెళుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.


