తాండూర్‌లో శునకాల బీభత్సం | - | Sakshi
Sakshi News home page

తాండూర్‌లో శునకాల బీభత్సం

Feb 4 2026 7:31 AM | Updated on Feb 4 2026 7:31 AM

తాండూ

తాండూర్‌లో శునకాల బీభత్సం

● ఒకే రోజు ఎనిమిది మందిపై దాడి

తాండూర్‌: మండల కేంద్రంలోని బస్టాండ్‌ ఏరియాతో పాటు పలు ప్రాంతాల్లో మంగళవారం శునకాలు బీభత్సం సృష్టించాయి. మండల కేంద్రానికి చెందిన లక్ష్మణ్‌, ముక్త సదయ్య, ఆర్‌.రాజేశ్వరి, పి.రాజేశ్‌, బి.సునీల్‌, బి.శ్వేత, ఎల్‌.శోభ, ఇ.స్వర్ణలతపై దాడిచేసి గాయపర్చాయి. క్షతగాత్రులను తాండూర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు.గాయాల తీవ్రత అధికంగా ఉన్న సదయ్య, రాజేశ్‌, లక్ష్మణ్‌ను బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి రెఫర్‌ చేసినట్లు వైద్యురాలు లక్ష్మీప్రసన్న తెలిపారు. ఒకేరోజు ఎనిమిది మందిపై దాడి చేయడంతో మండల వాసులు భయాందోళనకు గురవుతున్నారు.

బేలలో బాలుడిపై దాడి

కై లాస్‌నగర్‌(బేల): ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపర్చిన ఘటన మంగళవారం బేల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన భోయర్‌ దేవాన్ష్‌ (4) ఇంటిబయట ఆడుకుంటుండగా నాలుగు కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి గాయపర్చాయి. బాలుడి అరుపులు విన్న కుటుంబ సభ్యులు వచ్చి కుక్కలను తరిమేశారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో ప్రాథమిక చికిత్స అనంతరం రిమ్స్‌కు తరలించారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువజన కాంగ్రెస్‌ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్‌ రెడ్డి బాలుడిని పరామర్శించారు.

గాయపడిన సదయ్య

గాయపడిన బాలుడు

తాండూర్‌లో శునకాల బీభత్సం1
1/1

తాండూర్‌లో శునకాల బీభత్సం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement