హడలెత్తించిన ఏసీబీ దాడులు
మంచిర్యాలక్రైం: కలెక్టరేట్‌లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి హడలెత్తించారు. మధ్యాహ్నం 12 గంటలకు ఏక కాలంలో రెండు బృందాలుగా ఏర్పడి పశు సంవర్థక శాఖ కార్యాలయం, ఆ శాఖ ఏడీ శంకర్ ఇంట్లో సోదాలు నిర్వహించడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జిల్లాలో పనిచేస్తున్న నలుగురు పశుసంవర్ధక శాఖ వైద్యుల వద్ద నుంచి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కొంతవాటను కమీషన్ రూపంలో ఆన్‌లైన్ చెల్లింపులు జరిగినట్లు సమాచారం. కాగా తనిఖీల్లో 42 వివిధ రకాల బ్రాండ్లకు చెందిన మద్యం బాటిళ్లు లభించడంతో వాటిని స్వాధీనం చేసుకుని ఎకై ్సజ్ శాఖ అధికారులకు అప్పగించారు. కాగా సోదాలు రాత్రి వరకు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయమై ఏసీబీ డీఎస్పీ మధును వివరణ కోరగా సాధారణ తనిఖీల్లో భాగమేనన్నారు. పూర్తి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు.


