ఎఫ్‌డీపీటీ వాహనం అడ్డగింత
జన్నారం: ఇందిరమ్మ ఇళ్లకు అటవీశాఖ అధికారులు అనుమతి ఇవ్వడం లేదని మంగళవారం మండలంలోని ఇందన్‌పల్లి కుమురంభీం చౌరస్తా వద్ద ఎఫ్‌డీపీటీ శాంతారాం వాహనాన్ని లబ్ధిదారులు అడ్డుకున్నారు. జన్నారం అటవీ డివిజన్‌లోని గడ్డంగూడ, మురిమడుగు, దమ్మన్నపేట ప్రాంతాల పరిశీలనకు ఎఫ్‌డీపీటీ వచ్చారు. మురిమడుగుకు వస్తున్న విషయం తెలుసుకున్న ఇందన్‌పల్లికి చెందిన ఇందిరమ్మ లబ్ధిదారులు కుమురంభీం చౌరస్తా వద్దకు వెళ్లి వాహనాలను అడ్డుకున్నారు. ఇసుక కొరతతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఆగిపోతోందని, ఇసుక తీసుకువచ్చేందుకు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. ఎఫ్‌డీపీటీ వెంట ఉన్న రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ వారిని వారించారు. డివిజన్ కార్యాలయానికి వచ్చి సమస్య చెప్పుకొంటే పరిష్కారం చూపుతామని హామీ ఇవ్వగా వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.


