మెనూ పాటించాలి
లక్సెట్టిపేట: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మార్మాట్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికలు, బాలుర వసతిగృహాలను పరిశీలించి మా ట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఉ త్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని సూ చించారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. వసతిగృహంలోని వంట గదులు, రికార్డులు, పరిసరాలు పరిశీలించారు. వార్డెన్లు, ఉపాధ్యాయులున్నారు.
మంచిర్యాలఅర్బన్: జిల్లా కేంద్రంలోని గిరిజ న బాలుర పాఠశాలను ఐటీడీఏ పీవో యువరాజ్ మార్మాట్ సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనం, ఇతర స దుపాయాలు, సమస్యల గురించి తెలుసుకున్నారు. కంప్యూటర్ ల్యాబ్ పరిశీలించారు. ఐ టీడీఏ పల్స్‌యాప్ పనితీరుపై ఆరా తీశారు.


