నన్ను చూసైనా నేర్చుకోండి..
ఈ ఫొటోలో కనిపిస్తోంది ఆదిలాబాద్ జిల్లా కుప్టి ఘాట్‌రోడ్డులో జాతీయ రహదారి పక్కన నేషనల్ హైవే అధికారులు ఏర్పాటు చేసిన ప్రమాదానికి గురైన కారు. రెండు రోజుల కిత్రం కుప్టిఘాట్‌లో ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వెళ్లే జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జయిన ఓ కారును ‘నన్ను చూసైనా నేర్చుకోండి’ అని సంకేతం ఇచ్చేలా వాహనదారులకు కనిపించే విధంగా 5 ఫీట్ల ఎత్తులో ర్యాంప్‌పై ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగం ద్వారా అయినా కుప్టిఘాట్‌లో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టేనా? లేదా అన్నది వేచి చూడాల్సిందే మరి. – ఇచ్చోడ


