ఖా‘కీ’చకుడిపై సస్పెన్షన్‌ వేటు | - | Sakshi
Sakshi News home page

ఖా‘కీ’చకుడిపై సస్పెన్షన్‌ వేటు

Feb 4 2026 7:31 AM | Updated on Feb 4 2026 7:31 AM

ఖా‘కీ’చకుడిపై సస్పెన్షన్‌ వేటు

ఖా‘కీ’చకుడిపై సస్పెన్షన్‌ వేటు

● భార్య ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

మంచిర్యాలక్రైం: అతనో పోలీస్‌ ఉద్యోగి... అదే శాఖలో పనిచేస్తున్న అతనికంటే పెద్ద హోదాలో ఉన్న ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం ఇద్దరి దాంపత్య జీవనం సాఫీగానే సాగింది. ఫలితంగా దంపతులకు బాబు జన్మించాడు. స్థానిక రెడ్డికాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ నెల 1న అర్ధరాత్రి ఇద్దరి మధ్య జరిగిన గొడవ రోడ్డున పడింది. కానిస్టేబుల్‌ అర్ధనగ్నంగా (డ్రాయర్‌పై) ఉండి నడిరోడ్డుపై భార్యను చితకబాదిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అతని భార్య ఈ నెల 2న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కానిస్టేబుల్‌ రవిప్రసాద్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. కాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన దృశ్యాలను పరిశీలించిన రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా మంగళవారం రవిప్రసాద్‌ను సస్పెండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement