శ్రమ దోపిడీకి పాల్పడితే కఠిన చర్యలు
కాగజ్‌నగర్‌టౌన్: నిర్బంద శ్రమ దోపిడీకి పాల్ప డితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి యువరాజ అన్నారు. శుక్రవారం కాగజ్‌నగర్ మండలం ఈజ్‌గాం శివారులోని ఎస్‌స్టార్‌ఎస్ ఇటుక బట్టీలో డీసీపీవో బూర్ల మహేష్‌తో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి యువరాజ మాట్లాడుతూ ఒరిస్సాకు చెందిన మూడు నెలల బాలింత, 50 ఏళ్ల మహిళ, పదహారేళ్ల బాలుడిని నిర్భంద శ్రమదోపిడికి పాల్పడుతున్నారని, కనీస అవసరాలు కల్పించకుండా యజమాని వారిని కఠినంగా పని చేయించుకుంటున్నారని తమకు అందిన సమాచారం మేరకు తని ఖీలు నిర్వహించి బాధితులను జిల్లా కేంద్రంలోని సఖీ కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ప్యానల్ లాయర్ బ్రోమిక్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్, కౌన్సిలర్ చంద్రశేఖర్, సఖీ కేంద్రం సిబ్బంది శ్రీనిధి, హెడ్ కానిస్టేబుల్ శంకర్, తదితరులు పాల్గొన్నారు.


